కాంట్రవర్శీ కి కేరాఫ్ అడ్రస్ రాంగోపాల్ వర్మ. ప్రస్తుతం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాతో హల్ చల్ చేస్తున్న వర్మ తన నెక్స్ట్ సినిమా అనౌన్స్ చేస్తా అని సోమవారం ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. 29 న ఉదయం 9.36 నిమిషాలకు సినిమా టైటిల్ చెప్తానని, నెక్స్ట్ సినిమా మెగా ఫ్యామిలీ పై ఉంటుందని చెప్పుకొచ్చాడు వర్మ.
కానీ వర్మకి ఏమైందో కానీ వెనక్కి తాగ్గాడు. మెగా ఫ్యామిలీ లో 39 మంది పిల్లలు ఉన్నారు. పిల్లలు సినిమాలు తియ్యటం లో నేను అనుభవజ్ఞుడిని కాదు, పిల్లలతో నేను తియ్యను అని నిర్ణయించుకున్నాను అంటూ ట్వీట్ చేశాడు.
వర్మ పోస్టులకు అస్సలు ఏమి జరగబోతుందో అని నెట్టింట్లో నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. మొదట లక్ష్మిస్ ఎన్టీఆర్ సినిమాతో సంచలనం సృష్టించిన వర్మ, కమ్మ రాజ్యం లో కడప రెడ్లు సినిమాతో ఇప్పటికే కొన్ని పోస్టర్ లు రిలీజ్ చేసి హాట్ టాపిక్ గా నిలిచాడు.