అంబర్ పేట కుక్కలు దాడి చేసి నాలుగేళ్ల చిన్నారిని చంపేసిన ఘటన గురించి తెలిసిందే. ఆ సంఘటన జరిగిన దగ్గర నుంచి సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలంగాణ ప్రభుత్వం మీద ముఖ్యంగా మేయర్ గద్వాల విజయలక్ష్మి మీద విమర్శలు కురిపిస్తునే ఉన్నారు. మేయర్ ఇంట్లో 5 వేల కుక్కలను వదిలి పెట్టాలని ఆయన ఇప్పటికే ఆమె మీద విరుచుకుపడ్డారు.
అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఐదు ప్రశ్నలను కూడా సంధించి వాటికి సమాధానం చెప్పాలన్నారు. తాజాగా ఆయన మరోసారి ట్విట్టర్ వేదికగా స్పందించారు. అధికారిక హోదాలో మీరు ఏం చేయలేకపోతే.. కనీసం వ్యక్తిగత హోదాలోనైనా అంబర్‌పేట బాలుడి కుటుంబానికి సాయం చేయాలని సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గ్రేటర్ హైదరాబాద్ మేయర్గద్వాల విజయలక్ష్మిని కోరారు.
డాగ్లవర్ అయితే సరిపోదని.. తోటి మనుషులను కూడా ప్రేమించాలని మేయర్‌ను ట్యాగ్చేస్తూ వర్మ మంగళవారం ఉదయం వరుస ట్వీట్లు చేశారు. బాలుడు ప్రదీప్కుటుంబానికి తోటి పౌరులమైన మనం కూడా చేయూతనివ్వాలని, దయ కలిగిన వారు ఎవరైనా ఉంటే ప్రదీప్ తల్లిదండ్రుల జాయింట్అకౌంట్కు డబ్బు పంపి సాయం చేయాలని నగర ప్రజలను కోరారు. కాగా ఇప్పటి వరకు సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం విస్మయం కలిగిస్తోందని ఆర్జీవీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.
Madam @GadwalvijayaTRS ,if not in your official capacity , at least please send some money to this Pradeep’s father’s and mother’s account in your personal capacity ..It’s not enough to be a dog lover , you have to love your fellow humans too #JustifyPradeep pic.twitter.com/KGY19HiwMo
— Ram Gopal Varma (@RGVzoomin) February 28, 2023