నాగ్..అలా నటిస్తున్నానంతే !

నాగార్జున, రాంగోపాల్ వర్మల కాంబోలో వస్తున్న ” ఆఫీసర్ ” మూవీ షూటింగ్ ముంబైలో పూర్తయింది. దీంతో నాగ్ అక్కడినుంచి తిరిగి హైదరాబాద్ చేరుకున్నాడు . కొన్ని నెలలుగా నాగ్ తో కలిసి ఉన్న వర్మ.. ఆయన వెళ్ళిన తర్వాత తన టీమ్ విచారంలో మునిగిందని, తాను ఆనందంగా ఉన్నట్టు నటిస్తున్నానని తన ట్విటర్ లో పేర్కొన్నాడు.

” హే ..నాగార్జున.. మీరు మమ్మల్ని వదిలి హైదరాబాద్ వెళ్ళిపోయినప్పటినుంచి నేను, నా ” ఆఫీసర్ ” టీమ్ విచారాన్ని పక్కన పెట్టి ఆనందంగా ఉన్నట్టు నటిస్తున్నాం..సార్.. మీరు మమ్మల్ని ప్రేమించేదానికంటే మేము మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాం ” అని వర్మ ట్వీటించాడు.