న్యూఢిల్లీ: న్యాయరంగంలో దేశ దిగ్గజం రాంజెఠ్మలానీ మరి లేరు. అనారోగ్యంతో ఆయన కన్నుమూశారు. కేంద్ర మంత్రిగా కూడా దేశానికి సేవలందించిన ఈ లెజెండ్ లాయర్ వయస్సు 95 ఏళ్లు. ఆయనకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. చరిత్రాత్మక కేసులెన్నింటినో ఆయన వాదించి గెలుపొందారు. ఆరు, ఏడో లోక్‌సభలలో సభ్యుడిగా ఉన్నారు. ముంబై నుంచి రెండు పర్యాయాలు గెలిచారు. వాజ్‌పేయి సర్కార్‌లో న్యాయశాఖ మంత్రిగా పని చేశారు.