యూపీ మినిస్టర్ ఆనంద్ స్వరూప్ శుక్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాముడు, కృష్ణుడు, శివుడు.. భారతీయ ముస్లింలకు పూర్వీకులని చెప్పారు . భారతీ ముస్లింలు మక్కాను చూడాలని ఆశపడాల్సిన అవసరం లేదని, వీలైతే భారతీయ సంస్కృతికి నమస్కరించాలని చెప్పారు. దేశంలో ఇస్లామిక్ రాజ్యాన్ని సృష్టించాలనుకునే వారిని భారతీయ సంస్కృతి, హిందూత్వ జెండాతో ప్రధాని మోడీ, ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి అడ్డుకున్నారని చెప్పారు.
భారతీయ ముస్లిం పూర్వీకులు భయంతో ముస్లింలుగా మారారని ఆయన చెప్పారు. దీంతో వారి వారసులు కూడా ఇంకా ఇస్లామిక్ మనస్తత్వం కలిగి ఉన్నారని అన్నారు. మోడీ, యోగి ప్రభుత్వంలో కూడా వారి ఆలోచనలు మారలేదని చెప్పుకొచ్చారు. సిరియా, ఆఫ్ఘనిస్థాన్ తర్వాత కొన్ని దేశాలకు చెందిన వారు.. ప్రపంచాన్ని ఇస్లామిక్ స్టేట్‌గా మార్చాలనుకుంటున్నారని కానీ, భారత్‌లో కూడా అలాంటి ఆలోచనలు కలిగిన వారు ఉన్నారని ఆరోపించారు.