ఇస్మార్ట్ హీరో రామ్ కొంతకాలంగా మాస్ సినిమాలపై దృష్టిపెట్టాడు. ఇస్మార్ట్ శంకర్ హిట్ ఇచ్చినా రెడ్ మాత్రం బాక్సాఫీసు వద్ద బొల్తాకొట్టింది. రెడ్ రిలీజ్ టేస్ట్ చేసే వరకు కొత్త సినిమాలను అంగీకరించని రామ్… రెడ్ డిజాస్టర్ తర్వాత కామ్ అయిపోయాడు. పెద్ద దర్శకులంతా వచ్చే రెండు సంవత్సరాలు బిజీగా ఉండటంతో ఇప్పుడు రామ్ ఏంచేస్తారన్న చర్చ తెరపైకి వచ్చింది.
అయితే, రామ్ కొన్నాళ్ల పాటు బ్రేక్ తీసుకున్నట్లు ప్రకటించాడు. రామ్ శివ మాల ధరించాడు. దీంతో 41రోజుల పాటు నిష్టతో ఉండాల్సిందే. తను శివ మాల ధరించిన ఫోటో పెడుతూ… ఓం నమః శివాయ, చిన్న బ్రేక్ తీసుకున్నాను. మళ్లీ వస్తాను అంటూ మెసేజ్‌ను పోస్ట్ చేశారు.
Om Namah Shivaya!
Small break.. I’ll be back!!
Love..#RAPO pic.twitter.com/VFrr5Xi9Zk
— RAm POthineni (@ramsayz) February 6, 2021