ప్రముఖ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కృతి శెట్టి, అక్షర గౌడ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే ఆది పినిశెట్టి విలన్‌గా నటిస్తున్నారు.
అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి టైటిల్ ఫస్ట్ లుక్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు ది వారియర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇక ఫస్ట్ లుక్ లో మీసం మెలేస్తూ… పోలీస్ యూనిఫాం లో రామ్ సీరియస్ గా కనిపించాడు.
ఇక ఈ చిత్రం శ్రీనివాస చిట్టూరి హోమ్ బ్యానర్ శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై తెరకెక్కుతుంది. అలాగే సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.