ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ అందుకుని మంచి జోష్ మీద ఉన్నాడు హీరో రామ్. ప్రస్తుతం రామ్ రెడ్ సినిమాలో నటిస్తున్నాడు. నివేదా పేతురాజ్,మాళవికా శర్మ, అమృతా అయ్యర్ రామ్ సరసన నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా వైరస్ కారణంగా వాయిదా పడింది. ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ అప్పుడప్పుడు రామ్ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటాడు. తాజాగా రామ్ పుట్టిన రోజు సందర్భముగా ఈ సినిమాలోని మాస్ సాంగ్ టీజర్ ను విడుదల చేశారు.
డించాక్ డించాక్ అంటూ సాగే ఈ పాటలో హెబ్బా పటేల్ అందాలను ఆరబోసింది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు మణి శర్మ సంగీతం అందిస్తున్నాడు.