డైరెక్టర్ మారుతీ అనగానే మినిమం గ్యారెంటీ ఫిల్మ్ అన్న మాట వినిపిస్తుంది. ఇటీవలే ప్రతి రోజు పండగే సినిమాతో హిట్ అందుకున్న మారుతీ తర్వాత సినిమాలేవీ మొదలుపెట్టలేదు. ఇప్పుడు మారుతీ ఇస్మార్ హీరో రామ్ ను లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది.
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మాస్ హీరోలను మెప్పించిన ఫ్యామిలీ హీరో రామ్… ప్రస్తుతం రెడ్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా కూడా మాస్ ఎంటర్టైనర్ గానే వస్తుంది. దీంతో మూడో మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ కోసం చేయాలన్న రామ్ ఆలోచనకు మారుతీ స్క్రిప్ట్ అందించినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తికావటంతో… కథకు ఇంప్రెస్ అయిన రామ్ మూవీకి ఓకే చెప్పేశాడట. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. కరోనా వైరస్ ఎఫెక్ట్ తో ఇప్పటికే షూటింగ్ లన్నీ రీషెడ్యూల్ కావటంతో… ఈ సినిమా సెకండ్ ఆఫ్ తర్వాత సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం.