విడుదలకు రెడీ అయిపోయి… థియేటర్లు తెరుచుకునేందుకు ఎదురు చూస్తున్న మూవీ రెడ్. కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఇస్మార్ట్ హీరో రామ్ నటించిన ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కావాల్సింది. ఓటీటీ ద్వారా విడుదలకు రెడీ అవుతున్నారని ప్రచారం జరిగినా… రామ్ ఇంట్రెస్ట్ గా లేకపోవటంతో ఆ ప్రపొజల్ వెనక్కి పోయింది.
ఇప్పుడు థియేటర్లు ఓపెన్ కాబోతున్నాయి. సంక్రాంతి బొమ్మ పడాలన్న ఉద్దేశంతో చాలా సినిమాలు ఇప్పటి నుండే రెడీ అయ్యాయి. కానీ రెడ్ నుండి మాత్రం ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. మూవీ రిలీజ్ సంక్రాంతి బరిలో ఉంటుందా…? వచ్చే వేసవికి వాయిదా పడుతుందా అన్న అయోమయం నెలకొంది.