ఇస్మార్ట్ శంకర్ సినిమాతో కొత్తగా ట్రై చేసి, స్మార్ట్ విజయాన్ని సొంతం చేసుకున్న హీరో రామ్. ఆ ఊపులో ఇప్పుడు మరో సినిమాతో రెడి అయిపోతున్నాడు. ఆ చిత్రానికి ‘ రెడ్ ‘అనే పేరును ఖరారు చేశారు. ఇటీవల చిత్ర యూనిట్ రెడ్ మూవీ కి సంబందించి ఫస్ట్ లుక్ విడుదల చేసింది. రామ్ ఈ లుక్ లో జుట్టు చిన్నగా కత్తిరించుకుని గడ్డంతో కనిపిస్తున్నాడు. యాక్షన్ త్రిల్లర్ గా సాగనున్న ఈ మూవీ ఓ తమిళ సూపర్ హిట్ మూవీ రీమేక్ అని తెలుస్తుంది.
కిషోర్ తిరుమలతో రామ్ ఇప్పటికే రెండు సినిమాలు తీశాడు. నేను శైలజ మంచి హిట్ అందుకోగా, ఉన్నది ఒకటే జిందగీ యావరేజ్ గా ఆడింది. రెండు సినిమాల్లో రామ్ ని క్లాస్ గా చూపించిన దర్శకుడు ఈ సారి మాస్ లుక్ లో ని చూపించబోతున్నాడు. స్రవంతి రవికిషోర్ నిర్మాతగా, కిషోర్ తిరుమల దర్శకత్వం, మణిశర్మ సంగీతం అందించనున్నారు.