ఇస్మార్ట్ హీరోగా ప్రేక్షకులను మెప్పించిన హీరో రామ్. మరోసారి యాక్షన్ సినిమాలో తనను తాను నిరూపించుకునే ప్రయత్నంలో భాగంగా రెడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నిజానికి ఈ మూవీ ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉన్నప్పటికీ… కరోనా కారణంగా వాయిదా పడింది.
రెడ్ ను రిలీజ్ చేసేందుకు పలు ఓటీటీ సంస్థలు ఆసక్తి చూపినప్పటికీ… థియేటర్లలోనే రిలీజ్ చేస్తామని నిర్మాతలు స్పష్టం చేయటంతో విడుదల ఆగిపోయింది. తాజాగా ఈ మూవీని సంక్రాంతి బరిలో దింపాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. థియేటర్లు ఓపెన్ అవుతున్న నేపథ్యంలో నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రానుంది. ఈ నెల 24న సినిమా టీజర్ విడుదల చేసి, అదే రోజు మూవీ రిలీజ్ డేట్ రివీల్ చేయబోతున్నారు.
రెడ్ ను స్రవంతి రవికిషోర్ నిర్మిస్తుండగా, కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. నివేథా పేతురాజ్, మాళవిక శర్మ, అమృత అయ్యర్ ప్రధాన పాత్రలో నటించారు.