పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇటీవల రెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రామ్. అయితే ఈ సినిమా అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. ఇక తాజాగా చలో ఫేమ్ దర్శకుడు వెంకీ రామ్ ఓ లైన్ చెప్పినట్లు సమాచారం. కానీ వెంకీ చెప్పిన స్టోరీ లైన్ నచ్చకపోవడంతో రామ్ నో చెప్పాడట.
నిజానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో రామ్ సినిమా ఉంటుందని అందరూ భావించారు. కానీ త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్నాడు. వాటితో పాటు మరికొన్ని సినిమాలు కూడా త్రివిక్రమ్ చేతిలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రామ్ తో చేయాల్సిన సినిమా ఇప్పుడప్పుడే పట్టాలెక్కేలా కనిపించట్లేదు. ఈ నేపథ్యంలోనే రామ్ ఇతర దర్శకులతో చర్చలు జరుపుతున్నాడాట.