వచ్చే సంవత్సరం జూన్ ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఒకే దేశం ఒకే రేషన్ కార్డు విధానాన్ని ప్రవేశపెడ్తున్నట్టు కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ తెలిపారు. వలస కూలీలు దేశంలో ఎక్కడ ఉన్నా ఈ పథకం అమలవుతుందన్నారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ప్రజా పంపిణీ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ లోక్ సభలో ఈ విషయం వెల్లడించారు. వలస కూలీలకు, దినసరి కూలీలకు, ఉపాధి కోసం ఊరూరు తిరిగే వారికి ఈ విధానం బాగా ఉపయోగపడుతుందని చెప్పారు.