శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ రామారావు ఆన్ డ్యూటీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే తాజా సమాచారం ప్రకారం, మేకర్స్ నెక్స్ట్ షెడ్యూల్ కోసం స్పెయిన్‌కు వెళ్ళబోతున్నారట.
స్పెయిన్‌లో రొమాంటిక్ సాంగ్స్ ను షూట్ చేయనున్నారట. ఇక ఇందులో రవితేజ సరసన దివ్యాన్షా కౌశిక్ , రజిషా విజయన్‌లు నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ చిత్రం నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కుతుంది. అలాగే ఇందులో నటుడు వేణు తొట్టెంపూడి కీలక పాత్రతో నటిస్తున్నాడు. నాజర్, సీనియర్ నరేష్, పవిత్రా లోకేష్, ‘సర్పట్ట’ జాన్ విజయ్, చైతన్య కృష్ణ, తనికెళ్ల భరణి, రాహుల్ రామ కృష్ణ, ఈరోజుల్లో శ్రీ, మధు సూదన్ రావు, సురేఖ వాణి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సామ్ సిఎస్ సంగీత అందిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదల అయిన టీజర్, ఫస్ట్‌లుక్ సినిమాపై హైప్ ను తీసుకొచ్చాయి. ఈ చిత్రంలో రవితేజ ఎంఆర్‌ఓ రామారావుగా నటిస్తున్నారు.