చాలా మంది రాముడు మరియు సీతలది బాల్యవివాహమని వాదిస్తుంటారు. అయితే వాల్మీకి రామాయణం ప్రకారం చూస్తే వీరిది బాల్య వివాహం కాదు. వేద కాలంలో విద్యను ప్రారంభించడాన్ని ఉపనయనం అంటారు. ఇది బ్రాహ్మణులకు 8, క్షత్రియులకు 11, వైశ్యులకు 12 సంవత్సరాలుగా ఉన్నప్పుడు ప్రారంభిస్తారు. విద్యను ప్రారంభించడం 2 వ జన్మగా పరిగణిస్తారు. రాముడు సీత ఇద్దరూ క్షత్రియులే కాబట్టి వారు తమ 11 ఏట విద్యను ప్రారంభించారు.
అయితే అయోధ్య కాండలో… సీత రావణుడితో నేను పెళ్లి తర్వాత 12 ఏళ్లు అయోధ్యలో ఉన్నట్లు చెబుతుంది. ఆమె వనవాసం నుండి తిరిగొచ్చేటప్పటికీ ఆమె వయస్సు 18 , రాముడి వయస్సు 25 గా చెప్పబడింది. అంటే 18-12 = 6 పెళ్లి అయినప్పుడు సీత వయస్సు 6 గా చెబుతూ ఇది బాల్య వివాహంగా చెబుతున్నారు.
అయితే విద్యను ప్రారంభించడాన్ని 2వ జన్మగా పరిగణిస్తారు కాబట్టి….అప్పటి నుండి మళ్లీ వయస్సును కొత్తగా లెక్కిస్తారు. ఈ లెక్కప్రకారం సీత వయస్సు 6+11= 17. రాముడికి 24 కాబట్టి వీరిది బాల్య వివాహం కాదు!