ఏ గేయ రచయితకైనా ఓ డ్రీమ్ ఉంటుంది. తెరపై తన సింగిల్ కార్డ్ చూసుకోవాలని అనుకుంటాడు ఏ లిరిసిస్ట్ అయినా. దాన్ని ఓ ఘనతగా ఫీల్ అవుతారు. ఇక స్టార్ హీరో సినిమాకు సింగిల్ కార్డ్ అంటే అది చాలా పెద్ద విషయం. ఇలాంటి సింగిల్ కార్డులు ఎన్నో రాశారు రామజోగయ్య శాస్త్రి.
సంక్రాంతి సినిమాలు వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్యలో కూడా రామజోగయ్య పాటలున్నాయి. మరీ ముఖ్యంగా వీరసింహారెడ్డిలో మనోభావాలు సాంగ్ రాసింది ఈయనే. సినిమా మొత్తానికి ఒకరే పాటలు రాస్తే కలిగే సౌలభ్యం గురించి ఆయన చెబుతున్నారు.
“సింగిల్ కార్డ్ అయినా.. ఒక్క పాట అయినా.. దర్శకుడి కల కోసమే గేయ రచయిత పని చేస్తాడు. దర్శకుడు విజన్ కి తగట్టు అడుగులు వేయడంలోనే గేయ రచయిత గొప్పదనం ఉంటుంది. అయితే సింగిల్ కార్డ్ రాయడంలో ఒక సౌలభ్యం ఉంటుంది. పాటలన్నీ ఒకరే రాస్తారు కాబట్టి ఏ పాటలో ఎలాంటి మాట వాడాం, ఏ భావం చెప్పాం.. ఫ్లో సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆరు పాటలు ఆరుగురు రాస్తే మాత్రం.. ఈ కోర్డినేషన్ పని దర్శకుడు చూసుకోవాల్సి వస్తుంది.”
ఇలా సింగిల్ కార్డులో ఉండే సౌలభ్యాన్ని బయటపెట్టారు రామజోగయ్య శాస్త్రి. సంక్రాంతికి విడుదలవుతున్న చిరంజీవి, బాలయ్య సినిమాలు రెండూ రికార్డులు సృష్టిస్తాయని చెబుతున్నారీయన.