ఏపీ ఆర్థిక పరిస్థితిపై సీఎం జగన్ శ్వేతపత్రం విడుదల చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన 15 నెలల కాలంలోనే లక్ష కోట్ల రూపాయలు అప్పులు తేవటం నిజమా.. కాదా.. అని ఆయన ప్రశ్నించారు. వన్ నేషన్- వన్ రేషన్ విధానాన్ని అమలు చేస్తుండటంతో రాష్ట్ర జీఎస్‌డీపీలో 0.25% రుణ పరిమితి పెంచుకోవటానికి కేంద్రానికి లేఖ కేంద్రానికి లేఖ రాసింది నిజం కాదా అని నిలదీశారు.
రాష్ట్ర అభివృద్ధిపై ఏ మాత్రం దృష్టి పెట్టకుండా అప్పులు కోసం అర్రులు చాస్తున్నారని రామకృష్ణ విమర్శించారు.బడ్జెట్‌లో కొన్ని రంగాలకు కేటాయించిన నిధులలో సగభాగం కూడా ఖర్చు చేయలేదని ఆరోపించారు.
ఓవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెబుతూనే.. మరోవైపు ప్రజలపై అప్పుల గుదిబండ మోపుతున్నారని రామకృష్ణ మండిపడ్డారు. ప్రభుత్వం తెచ్చిన అప్పులతో రాష్ట్రంలో ఏయే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారో ప్రజలకు సమాధానం చెప్పాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.ఈ మేరకు సీఎం జగన్‌కు ఆయన ఓ లేఖ రాశారు.