గత ఏడాది వచ్చిన క్రాక్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ ను అందుకున్నాడు మాస్ మహారాజ రవితేజ. ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తూ ఫుల్ జోష్ మేద ఉన్నాడు. ఖిలాడీ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉండగా రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. వీటితో పాటు టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ లో కూడా నటిస్తున్నాడు. అయితే తన సినిమాలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ని ఇస్తూనే ఉన్నాడు ఈ మాస్ హీరో.
తాజాగా రామారావు ఆన్ డ్యూటీ సినిమాకు సంబంధించి మరో అప్డేట్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. సోమవారం డిసెంబర్ 10న ఉదయం 10 గంటల 8 నిమిషాలకు ఓ మాసివ్ అనౌన్స్మెంట్ ఇస్తున్నట్టుగా ప్రకటించారు. ఇక ఈ చిత్రంలో దివ్యాన్షా కౌశిక్ హీరోయిన్ గా నటిస్తుండగా శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్నారు.