మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం ఫుల్ జోష్ మీద ఉన్నాడు. వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. అందులో నూతన దర్శకుడు శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామారావు ఆన్ డ్యూటీ ఒకటి. పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్, రజీష విజయన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా సినిమా పై హైప్ ను తీసుకువచ్చాయి. కాగా నేడు రవితేజ పుట్టినరోజు సందర్భంగా మరో కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
ఈ పోస్టర్ ను కాస్త డిఫరెంట్ గా డిజైన్ చేశాడు దర్శకుడు. పోస్టర్ లో ట్రైన్ సన్నివేశం రొమాంటిక్ ట్రాక్ తో పాటు ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ అంశాలను పెట్టి డిజైన్ చేశారు. ఇక ఈ సినిమాను ఎస్ఎల్వీ సినిమాస్ ఎల్ఎల్పి, ఆర్టి టీమ్‌వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
వీటితో పాటు రవితేజ నటించిన ఖిలాడి చిత్రం రిలీజ్ కు సిద్ధంగా ఉంది. అలాగే రావణాసుర, ధమాకా చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి.