రామయంపేట తల్లి, కొడుకుల ఆత్మహత్య కేసులో ఆరుగురు నిందితులను కామారెడ్డి కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. ఈ మేరకు విచారణ చేపట్టిన కోర్టు.. నిందితులకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించాలని తీర్పునిచ్చింది.
దీంతో నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిని కోర్టు నుండి నేరుగా నిజామాబాద్ జైలుకు తరలించారు. అయితే.. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సీఐ నాగార్జున్ గౌడ్ పరారీలో ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు.
మరోవైపు నిందితులు బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నారు. నిందితులు దాఖలు చేసిన పిటిషన్ పై స్పందించిన న్యాయస్థానం.. బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపేందుకు కోర్టు తీర్పును మే 4కు వాయిదా వేసింది.
రామాయంపేటకు చెందిన పద్మ, ఆమె కుమారుడు సంతోష్ కామారెడ్డిలో ఆత్మహత్య చేసుకున్నారు. తమ వ్యాపారంలో పాట్నర్ గా ఉన్న వ్యక్తితో పాటు.. మరో ఏడుగురు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ సెల్ఫీ వీడియో తీసుకొని.. ఓ లాడ్జీ గదిలో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణలో భాగంగా నిందితులను కోర్టులో హాజరుపరిచారు.