మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో ఓ కీలక రోల్ లో నటిస్తున్న రాంచరణ్ షూటింగ్ డేట్స్ ఫిక్స్ అయ్యాయి. డిసెంబర్ నుండి శరవేగంగా షూటింగ్ జరుపుకోనున్న ఆచార్య కోసం రాంచరణ్ సంక్రాంతి తర్వాత డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ సినిమాలో నటిస్తున్న రాంచరణ్, డైరెక్టర్ రాజమౌళితో చర్చించి ఈ డేట్స్ కన్ఫామ్ చేసినట్లు ఆచార్య మూవీ యూనిట్ వర్గాల సమాచారం.
ఈ టైంలోనే మెగాస్టార్, రాంచరణ్ లపై కొన్ని కీలక సన్నివేశాలు పూర్తి చేయనుండగా… సింగిల్ షెడ్యూల్ లో రాంచరణ్ తన షూట్ ను పూర్తి చేయనున్నారు. ఇక డిసెంబర్ నుండి కొత్త పెళ్లి కూతురు కాజల్ షూటింగ్ కు హజరుకాబోతున్నారు.