చెర్రీ-బోయపాటి డీల్ 22 కోట్లు!

రామ్‌చరణ్ – కైరా అద్వానీ జంటగా టాలీవుడ్‌లో ఓ ఫిల్మ్ రానుంది. బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంపై అంచనాలు పెరిగిపోతున్నాయి. రీసెంట్‌గా ఫస్ట్ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తికాగా, ఇప్పుడు రామ్‌చరణ్ షూట్‌కి హాజరయ్యాడు. ఇదిలా వుండగా బోయపాటి సినిమాలకు నార్త్‌లో మాంచి డిమాండ్ వుంది. గతంలో ఆయన డైరెక్ట్ చేసిన సరైనోడు, జయ జానకి నాయక వంటి చిత్రాలు మాంచి రేటుకి వెళ్లడంతో నిర్మాతలు ఫుల్‌ఖుషీ.

ఇప్పుడు చెర్రీ ప్రాజెక్ట్‌ హిందీ శాటిలైట్ రైట్స్‌ కూడా భారీ రేటుకే వెళ్లినట్టు ఇన్‌సైడ్ సమాచారం. దాదాపు 22 కోట్ల రూపాయలకు వెళ్లినట్టు తెలుస్తోంది. సింపుల్‌గా చెప్పాలంటే టాలీవుడ్ మూవీ ఈ రేంజ్‌లో అమ్ముడు పోవడం ఇదే ఫస్ట్ టైమ్. దీంతో మేకర్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. ఇందులో వివేక్ ఓబెరాయ్, ప్రశాంత్, స్నేహ వంటి నటీనటులు కీలకపాత్ర పోషిస్తున్నారు. అంతా అనుకున్నట్లుగా జరిగితే దసరాకి రిలీజ్ చేయాలన్నది నిర్మాత డీవీవీ దానయ్య ప్లాన్.