చెర్రీకి ఆ టైటిల్ ఖాయం!

రామ్‌చరణ్ -బోయపాటి కాంబినేషన్‌లో ఓ ఫిల్మ్ రానుంది. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసిన యూనిట్, సెకండ్ షెడ్యూల్ చిత్రీకరణలో బిజీ అయ్యింది. కొద్దిరోజుల కిందట చెర్రీ కూడా హాజరయ్యాడు. ముందుగా టైటిల్ ప్రకటన చేయాలని ఆలోచన చేస్తోంది. దీనివల్ల మూవీకి మాంచి ప్రమోషన్ వస్తుందని అంచనా వేస్తోంది. స్టోరీ తగ్గట్టుగా దీనికి ‘రాజవంశస్థుడు’ అనే టైటిల్ ఎలా వుంటుందని భావిస్తున్నాడట డైరెక్టర్ బోయపాటి.

ఈ విషయం ఫిల్మ్ సర్కిల్స్‌లో హంగామా చేస్తోంది. కాకపోతే ఈ పేరుకు మెగాక్యాంప్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి వుంటుంది. ఈ టైటిల్‌కి రెస్పాన్స్ వస్తే, దీన్ని ఓకే చేసే అవకాశం వుందని అంటున్నారు. మొత్తానికి యూనిట్ నుంచి ఫీలరైతే వచ్చింది.. దీన్ని ఓకే చేస్తారా? లేదా అన్నది చూడాలి.