ఆర్.ఆర్.ఆర్ సినిమాలో ఫుల్ బిజీగా ఉన్న మెగా పవర్ స్టార్ రాంచరణ్… ఆచార్య సినిమాలో మెగాస్టార్ తో కలిసి నటిస్తున్నారు. ఆచార్యలో ఓ కీ రోల్ కోసం చిరంజీవితో కలిసి రాజమండ్రికి వచ్చిన చరణ్, తన షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసుకున్నాడు. దాదాపు 20రోజులుగా చరణ్ రాజమండ్రిలోనే మకాం వేశాడు.
తన షూటింగ్ పూర్తికావటంతో భార్య ఉపాసనతో కలిసి చరణ్ హైదరాబాద్ వచ్చేశాడు. అయితే, ఆచార్య యూనిట్ మాత్రం ఇంకా అక్కడే ఉంది. ఆచార్య పూర్తైన నేపథ్యంలో… త్వరలోనే తిరిగి ఆర్.ఆర్.ఆర్ యూనిట్ తో చరణ్ జత కలవనున్నాడు.
#MegaPowerStar @AlwaysRamCharan gets a sensational send off from fans as he wraps up a 20-days schedule of #Acharya with his father @KChiruTweets#RamCharan pic.twitter.com/noDFLD7SvH
— Kaushik LM (@LMKMovieManiac) March 5, 2021