సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సినీ సెలబ్రిటీలు వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకోటానికి ట్విట్టర్ ను వేదికగా ఎంచుకుంటున్నారు. అయితే చిరంజీవి వారసుడిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన రాంచరణ్ మొన్నటివరకు కాస్తా వెనుకే ఉన్నడాని చెప్పాలి. అప్పుడెప్పుడో ఫేస్ బుక్ లోకి వచ్చిన రామ్ చరణ్ ఆ తరవాత ఇన్ స్టా గ్రామ్ లోకి అడుగుపెట్టాడు.ఇక తాజాగా తన తండ్రి చిరజీవి ట్విట్టర్ లో ఎంట్రీ ఇచ్చిన రోజే తాను కూడా ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇచ్చాడు రామ్ చరణ్.. ట్విట్టర్ లోకి రాగానే తన మొదటి పోస్ట్ గా కరోనా వైరస్ పై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న పోరాటానికి గాను తన వంతు సహాయంగా 70 లక్షల రూపాయలను విరాళంగా ఇస్తున్నట్లు ట్వీట్ చేసాడు. దీనికి తన బాబాయ్ పవన్ కళ్యాణ్ స్ఫూర్తి అని రామ్ చరణ్ పేర్కొన్నాడు.
ఇక ఇది ఇలా ఉంటే ఇన్‌స్టాగ్రామ్‌లో 2 మిలియన్స్ మార్క్ చేరుకున్నాడు రామ్ చరణ్. కేవలం 67 పోస్ట్‌లు మాత్రమే పోస్ట్ చేసిన చరణ్ ఈ ఘనత దక్కించుకోవడం విశేషం. ఎక్కువగా ఫ్యామిలీకి సంబంధించిన పోస్ట్‌లు పెడుతూ ఉంటాడు రామ్ చరణ్..ప్రస్తుతం రామ్ చరణ్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తున్నాడు . ఈ చిత్రంలో చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నాడు వచ్చే ఏడాది జనవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.