పుట్టిన రోజు సందర్భంగా ఫ్లెక్సీలు కడుతూ విద్యుత్ షాక్ కు గురై ముగ్గురు పవన్ అభిమానులు మరణించిన సంగతి తెలిసిందే. చిత్తూరు జిల్లా శాంతిపురం లో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు 2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని పవన్ కళ్యాణ్ జిల్లా పార్టీ కార్యాలయ సిబ్బందిని ఆదేశించిన సంగతి తెలిసిందే.
తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మృతుల కుటుంబాలకు తన వంతు సహాయంగా ఒక్కో కుటుంబానికి 2.5 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. ఈ మేరకు ప్రెస్ నోట్ ను రిలీజ్ చేశారు. పోయిన ప్రాణాలను తీసుకురాలేము. కష్ట సమయంలో వారి కుటుంబాలకు అండగా నిలుద్దాం అంటూ రామ్ చరణ్ పేర్కొన్నారు.