ప్రస్తుతం హాలీవుడ్ లో సందడి చేస్తున్నాడు రామ్ చరణ్. ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ కు నామినేట్ అయిన సందర్భంగా యూఎస్ఏ లో మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్న ఈ హీరో, పలు అంశాలపై తన అభిప్రాయాల్ని వెల్లడిస్తున్నాడు. ఇందులో భాగంగా హాలీవుడ్ లో నటించాలనే కోరికను బయటపెట్టాడు చరణ్.
“ప్రస్తుతం ఇండియాలో ఒక సినిమా చేస్తున్నాను. మరో సినిమాకు కమిట్ అయ్యాను. ఇండియా వెలుపల కూడా పనిచేయాలని అనుకుంటున్నాను. హాలీవుడ్ దర్శకులు ఇండియన్ టాలెంట్ ను చూడాలని కోరుకుంటున్నాను. హాలీవుడ్ నుంచి నాతో పాటు మరింతమందికి కాల్స్ వస్తాయని ఆశిస్తున్నాను.”
ఇలా హాలీవుడ్ సినిమాల్లో నటించాలని ఉందంటూ తన మనసులో మాట బయటపెట్టాడు రామ్ చరణ్. ఇప్పటికే చాలామంది భారతీయ నటీనటులు హాలీవుడ్ సినిమాల్లో నటించారు. ప్రియాంక చోప్రా లాంటి వాళ్లు ఏకంగా అక్కడ సెటిల్ అయిపోయారు కూడా. ఇప్పుడు టాలీవుడ్ నుంచి రామ్ చరణ్ కు ఆ అవకాశం దక్కుతుందేమో చూడాలి.