ఆర్ఆర్ఆర్ చిత్రంతో మెగా పవర్ స్టార్ భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన రామ్ చరణ్.. ఇప్పుడు తన తర్వాతి సినిమాపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమాని టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో రామ్ చరణ్‌కు జోడిగా హీరోయిన్ కియారా అద్వానీ నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. అయితే, తాజాగా ఈ సినిమా నుంచి రామ్ చరణ్ ఫోటో లీక్ అవ్వడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
ఈ సినిమాలో చెర్రీ ఐఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారని, రాజకీయ వ్యవస్థకు, ప్రభుత్వ వ్యవస్థకు మధ్య జరిగే పోరాటమే ఈ సినిమా కథాంశమని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే తాజాగా లీక్ అయిన ఫోటో ఒక్కసారిగా మూవీపై అంచనాలను పెంచేసింది. అంచనాలే కాకుండా సినిమా కథకు సంబంధించి కూడా పలు అనుమానాలను రేకెత్తిస్తోంది.
ఇక లీకైనా ఫోటోలో చెర్రీ.. వైట్ కలర్ పంచెలో సైకిల్ తొక్కుతున్నారు. సాంప్రదాయ పంచె కట్టు, పక్క పాపిడి, చేతికి నల్ల కాశీ తాడు.. వైట్ అండ్ వైట్ లుక్‌లో హ్యాండ్ మడత పెట్టి ఒక సాధారణ గ్రామ సర్పంచ్‌లా కనిపిస్తున్నారు. దీంతో రామ్ చరణ్ ఈ సినిమాలో రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారని తెలుస్తోంది. మరోవైపు ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
ఇప్పటివరకు ఈ చిత్రంలో రామ్‌చరణ్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించనున్నారని, ఒకటి స్టూడెంట్‌గా.. రెండోది ఐఏఎస్ ఆఫీసర్ అని చర్చ జోరుగా సాగింది. అయితే, ఇప్పుడు మాత్రం తండ్రీ కొడుకులుగా చరణ్ కనిపించబోతున్నారని, 1980 లో ఒక ఫ్లాష్ బ్యాక్ నేపథ్యంలో సన్నివేశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా శంకర్ సినిమా అంటేనే ఓ ఫ్లాష్‌బ్యాక్ కచ్చితంగా ఉంటుంది. ఆ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ సినిమాకే మెయిన్ హైలైట్‌గా నిలుస్తుంది.
రామ్ చరణ్‌తో చేస్తున్న సినిమాలో కూడా ఓ పవర్ ఫుల్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌ను శంకర్ ప్లాన్ చేశారట. అందులో చరణ్ ఒక రాజకీయ నాయకుడిగా నటిసున్నట్లు సమాచారం. తండ్రి బాటలోనే యంగ్ చరణ్ కూడా ఐఏఎస్ ఆఫీసర్ నుంచి పొలిటీషియన్‌గా మారతాడట. మరీ నెట్టింట వైరల్ అవుతోన్న ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఏది ఏమైనా ఒక్క ఫోటోతో రామ్ చరణ్-శంకర్‌ల సినిమాపై ఊహగానాలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం రామ్ చరణ్ న్యూ లుక్‌ను అభిమానులు నెట్టింట తెగ వైరల్ చేస్తున్నారు.