రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి కలిసి సృష్టించిన ఎపిక్ మూవీ ఆర్ఆర్ఆర్. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా భారీ వసూళ్లు సాధించింది. వెయ్యి కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ అందుకుంది. నెట్ ఫ్లిక్స్, జీ5 కారణంగా ఈ సినిమా ఇప్పటికీ హాట్ టాపిక్ గా నలుగుతోంది. ఇలాంటి టైమ్ లో ఆర్ఆర్ఆర్ బ్యాచ్ ముగ్గురూ మరోసారి చేతులు కలుపుతున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈసారి సినిమా కోసం మాత్రం కాదు.
ఆర్ఆర్ఆర్ థీమ్ తో ఓ భారీ రెస్టారెంట్ రాబోతోంది. ఓ బడా ప్రొడ్యూసర్ ఈ రెస్టారెంట్ ప్లాన్ చేస్తున్నాడు. రెస్టారెంట్ లో థీమ్ మొత్తం ఆర్ఆర్ఆర్ చుట్టూ తిరుగుతుంది. స్పెషల్ మెనూ కూడా సిద్ధం చేస్తున్నారట. ఇప్పుడీ రెస్టారెంట్ ఓపెనింగ్ కు ఆర్ఆర్ఆర్ త్రయాన్ని ఆహ్వానించాలని సదరు నిర్మాత భావిస్తున్నాడట.
చరణ్, తారక్, జక్కన్న ఎప్పుడు ఓకే అంటే.. అప్పుడే రెస్టారెంట్ ఓపెనింగ్ పెట్టుకోవాలనుకుంటున్నారట. అలా ఈ ముగ్గురు మరోసారి కలవబోతున్నారు. ఇక ఈ ముగ్గురి కాంబినేషన్ లో సినిమా మాత్రం ప్రస్తుతానికి అసాధ్యమనే అనుకోవాలి.
చరణ్ చేతిలో 2 సినిమాలున్నాయి. తారక్ చేతిలో 3 సినిమాలున్నాయి. ఇక రాజమౌళి, మహేష్ మూవీతో బిజీగా ఉన్నాడు. ఈ కమిట్ మెంట్స్ పూర్తయి, వీళ్లు మరోసారి కలవాలంటే కనీసం ఐదేళ్లయినా పడుతుంది. పైగా ఆర్ఆర్ఆర్ లాంటి కథ మళ్లీ కుదరాలి. అది అన్నింటికంటే పెద్ద విషయం.