మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ తో పాటు ఆచార్య మూవీలో నటిస్తున్నారు. కానీ తర్వాత సినిమాలేవీ ఒప్పుకోలేదు. చాలా మంది యంగ్ డైరెక్టర్స్ స్క్రిప్ట్ తో చరణ్ ను కలిసినప్పటికీ రిజెక్ట్ చేస్తూ వచ్చాడు. దీంతో రెండు మెగా మూవీల తర్వాత చరణ్ ఎలాంటి సినిమా చేస్తాడోనన్న ఆసక్తి ఉండేది.
ఫైనల్ గా చరణ్ యంగ్ డైరెక్టర్ చెప్పిన స్క్రిప్ట్ కు ఒకే చెప్పేశాడు. జెర్సీ సినిమా తీసిన డైరెక్టర్ గౌతమ్ చెప్పిన కథకు ఇంప్రెస్ అయినట్లు తెలుస్తోంది. గౌతమ్ ప్రస్తుతం జెర్సీని షాహిద్ కపూర్ తో కలిసి హిందీలో రీమేక్ చేస్తున్నాడు.
ఎన్వీర్ సినిమాస్ బ్యానర్ పై ఎన్.వి ప్రసాద్ ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ సినిమా వచ్చే సమ్మర్ తర్వాత సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.