ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజా చిత్రం RC15 మూవీ టైటిల్‌ను చిత్ర యూనిట్ తాజాగా అనౌన్స్ చేసింది. దర్శకుడు శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘గేమ్ ఛేంజర్’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసింది.
ఈ టైటిల్ లోగోను తాజాగా చరణ్ పుట్టినరోజు కానుకగా రిలీజ్ చేశారు మేకర్స్. గతంలో ఈ సినిమాకు CEO, విశ్వాంభర వంటి టైటిల్స్ పేరు వినిపించాయి. అయితే చాలా మంది ఈ సినిమాకు CEO అనే టైటిల్‌ను ఫిక్స్ చేస్తారని భావించారు. సోషల్ మీడియాలోనూ ఈ టైటిల్‌ను దాదాపుగా ఖరారు చేశారు.
అయితే ఎవరూ ఊహించని విధంగా చిత్ర యూనిట్ మాత్రం ఔట్ ఆఫ్ ది బాక్స్ టైటిల్‌ను పట్టుకొచ్చి అందరినీ సర్‌ప్రైజ్ చేసింది. పూర్తి పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రాబోతుందని టైటిల్ లోగోలో రివీల్ చేసింది చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాలో ‘గేమ్ ఛేంజర్’గా చరణ్ ఎలాంటి పాత్రలో కనిపిస్తాడా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేయగానే ‘గేమ్ ఛేంజర్’ ట్విట్టర్‌లో నెంబర్ వన్ స్థానంలో ట్రెండింగ్ అవుతోంది. ఇక ఈ సినిమాలో అందాల భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోండగా, మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నాడు