ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు రామ్ చరణ్. ఓవైపు కమల్ హాసన్ హీరోగా ఇండియన్-2 సినిమా చేస్తున్నప్పటికీ, సమాంతరంగా రామ్ చరణ్ మూవీని కూడా కొనసాగిస్తున్నాడు శంకర్. తాజాగా మరో కొత్త షెడ్యూల్ కూడా మొదలైంది.
ఇదిలా ఉండగా, ఇప్పుడీ సినిమాపై కొత్త ప్రచారం మొదలైంది. దీపావళి కానుకగా శంకర్-రామ్ చరణ్ సినిమా నుంచి ఫస్ట్ లుక్ వచ్చే ఛాన్స్ ఉందంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాట దీపావళి చాలా పెద్ద పండగ. ఇలా కామన్ గా ఫెస్టివల్ కలిసి రావడంతో.. తెలుగు-తమిళ భాషల్లో ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేసే అవకాశం ఉందంటూ గాసిప్స్ వినిపిస్తున్నాయి. కనీసం టైటిల్ అయినా ప్రకటించే ఛాన్స్ ఉందంటున్నారు చాలామంది.
అటు శంకర్ మాత్రం దీనిపై ఎలాంటి లీకులు ఇవ్వలేదు. కెరీర్ లో తొలిసారి రెండు సినిమాల్ని సైమల్టేనియస్ గా చేస్తున్న ఈ దర్శకుడు.. ప్రచార బాధ్యతల్ని పూర్తిగా నిర్మాత దిల్ రాజుకే అప్పగించాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది.
కియరా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్, 3 డిఫరెంట్ షేడ్స్ లో కనిపిస్తాడట. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.