ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఆచార్య మూవీలో మెగాస్టార్ హీరోగా నటిస్తుండగా, రాంచరణ్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. సినిమా మొదలైనప్పటి నుండి రాంచరణ్ వస్తాడా… రాడా… అన్న ఉత్కంఠ కొనసాగగా, చిరు జోక్యంతో రాజమౌళి ఒప్పుకోవటంతో రాంచరణ్ నటించేందుకు లైన్ క్లియర్ అయ్యింది.
దాదాపు 40నిమిషాల పాటు ఉండే రాంచరణ్ క్యారెక్టర్ సినిమాకు కీ పాయింట్ అని తెలుస్తోంది. ఇప్పటికే సినిమా షూట్ చాలా వరకు పూర్తవగా, రాంచరణ్ పై షూట్ పూర్తయితే షూటింగ్ దాదాపు ముగిసినట్లే. దీంతో డైరెక్టర్ కొరటాల శివ త్వరలో నెక్ట్స్ షెడ్యూల్ కు ప్లాన్ చేశారు. రాంచరణ్ పై జనవరి 11నుండి షూటింగ్ మొదలవ్వనుంది. ఈ షెడ్యూల్ లో రష్మీక కూడా పాల్గొననుండగా.. ఫైనల్ షెడ్యూల్ ఫిబ్రవరి నుండి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది.