చిత్తూరు జిల్లాలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీ ప్రమాదంలో ముగ్గురు యువకులు కరెంట్ షాక్‌తో మరణించిన సంగతి తెలిసిందే. ఇదే విషయమై పవన్ మాట్లాడుతూ ఇది మాటలకందని విషాదమని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తల్లిదండ్రుల గర్భ శోకాన్ని అర్ధం చేసుకోగలనన్న పవన్… వారికి తానే ఇకపై బిడ్డగా నిలుస్తానని చెప్పారు. వారిని ఆర్థికంగా తానే ఆదుకుంటానని అన్నారు.
తాజా రాంచరణ్ ఇదే విషయమై స్పందించారు. కుప్పంలో జరిగిన దుర్ఘటనలో ముగ్గురుఅభిమానులు కాలం చేశారు అనే వార్త నన్నుదిగ్భ్రాంతికి గురిచేసింది. మీ ఆరోగ్యం, మీ ప్రాణంకంటే ఏదీ విలువైనది కాదు. మీరంతా ఇదిఎప్పుడూ గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా ఉండాలని నా మనవి. ఈ దుర్ఘటనలో మరణించిన వారి ఆత్మకు శాంతి
చేకూరాలని ప్రార్ధిస్తూ వాళ్ళ కుటుంబాలకు నాప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
— Ram Charan (@AlwaysRamCharan) September 2, 2020