దక్షిణ భారతదేశంపై మోడీ సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారంటూ అప్పుడప్పుడు రాజకీయ విమర్శలు వస్తూనే ఉన్నాయి. దానికి బీజేపీ నేతల ప్రతి విమర్శలు కామన్. కానీ ఇప్పుడు ఆ లిస్ట్‌లో కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి కోడలు ఉపాసన కూడా చేరిపోయినట్లే ఉన్నారు.
నరేంద్రమోడీ గారు… మీరు ప్రధానిగా ఉండటం గర్వకారణం. మీరు కేవలం బాలీవుడ్ వారినే పిలిచి గౌరవించటం మాత్రం మాకు నచ్చలేదు. సాంసృతిక పరంగా మేము కూడా ఉన్నాం అంటూ గుర్తు చేసింది.
ఇప్పుడీ ట్వీట్ వైరల్ అవుతోంది. చిరంజీవి ఇటీవలే వెళ్లి మోడీని కలిసి వచ్చారు కూడా. ఇలాంటి తరుణంలో రాంచరణ్ భార్య చేసిన ట్వీట్ రాజకీయంగానూ ఆసక్తిగా మారుతోంది.
అయితే, ప్రధానితో విందుకు దక్షిణాధి వారు కూడా హజరయ్యారని తెలుస్తోంది. తెలుగు నిర్మాత దిల్ రాజ్ తో పాటు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా హజరయినట్లు సమాచారం. దీంతో… కావాలనే మెగా గ్రూపును, టీడీపీ- వైసీపీతో ఉండే గ్రూపులను పక్కనపెట్టారా అన్న చర్చ ఊపందుకుంది.