ఓ కొత్త సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు శుభాభినందలు తెలపడం సర్వసాధారణం. ఈ విషయంలో హీరోలంతా ఐకమత్యంగా ఉంటారు. తమకు పోటీగా సినిమా రిలీజ్ అవుతున్నప్పటికీ విశెష్ చెప్పడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. హీరో రామ్ చరణ్ కూడా అదే పని చేశాడు. కాకపోతే కాస్త భిన్నంగా స్పందించాడు. అదిప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఈరోజు గని సినిమా రిలీజైంది. వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్పాడు రామ్ చరణ్. ఈ సందర్భంగా ఓ మీమ్ ను వాడాడు. గని గట్టిగా కష్టపడుతుంటే.. మనకు పోటీ వచ్చేలా ఉన్నాడంటూ చరణ్ ఇచ్చే ఎక్స్ ప్రెషన్స్ తో ఈ మీమ్ క్రియేట్ చేశారు.
దీన్ని చరణ్ షేర్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఆ వెంటనే వరుణ్ తేజ్ కూడా దీనిపై స్పందించాడు. పెద్దగా నవ్వుతూ, చరణ్ కు థ్యాంక్స్ చెప్పాడు. గని రిలీజ్ సందర్భంగా చాలామంది వరుణ్ తేజ్ కు విశెష్ చెప్పారు. అయితే, అందర్లో రామ్ చరణ్ పెట్టిన పోస్ట్ మాత్రమే అందర్నీ ఎట్రాక్ట్ చేసింది.
అల్లు అరవింద్ పెద్ద కొడుకు అల్లు బాబి, మెగా బంధువు సిద్ధు ముద్ద ఈ సినిమాతో నిర్మాతలుగా మారారు. కథకు కావాల్సిన దానికంటే కాస్త ఎక్కువే ఖర్చుపెట్టారు. ఇక ఈ సినిమాతో కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయమవ్వగా, మహేష్ మంజ్రేకర్ కూతురు సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా పరిచయమైంది. ఈ సినిమా పూర్తి రిజల్ట్ ఏంటనేది సోమవారానికి ఓ క్లారిటీ వస్తుంది.