ఎన్నో వివాదాలతో జనం నోళ్లలో ఉన్న సినిమా ఇది. ఫ్రీగా పబ్లిసిటీ ఎలా తెచ్చుకోవాలో డైరెక్టర్ వర్మ తనకు తానే సాటి. కానీ ఆ పబ్లిసిటిని వాడుకోవటం అయినా తెలియాలి కదా. మరోసారి అదే పాయింట్‌లో బోల్తా కొట్టారు డైరెక్టర్ వర్మ.
వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్యలో జనసేన కాన్సెప్ట్‌తో బాబును టార్గెట్ చేస్తూ పేరడి తరహాలో వచ్చిన సినిమా. కానీ ఎందుకు సినిమా తీశారో, ఎం చెప్పాలనుకున్నారో వర్మకు కూడా ప్రత్యేకంగా అర్థం కానట్లుంది. కేవలం ఏపీ నాయకుల పేరడీ డైలాగ్‌ల సినిమా ఇది అనొచ్చు.
నాయకులపై బయట ఉన్న సెటైర్లకు దృశ్యరూపం ఇచ్చి, తనకు ఉన్నకోపంతో నాయకులను టార్గెట్ చేసి కలెకూర గంపలా తీశారు. కానీ ఏమాటకు ఆ మాట చెప్పుకోవాలి. సినిమాలో క్యారెక్టర్స్ మాత్రం సూపర్ అని చెప్పుకోవచ్చు. ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఒక్కో చోట కాస్త బాగానే ఉన్నా… కొన్ని చోట్ల చిరాకు పుట్టిస్తుంది.
పంచ్ డైలాగ్— ఓ 20రోజులు ఆగితే ఏ అమెజాన్ ప్రైమ్‌లోనో, నెట్‌ఫ్లిక్స్‌లోనో సినిమా చూడొచ్చు.
ఈ సినిమాలో పెరడీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు హైలెట్ అయితే మిగతావన్నీ పెద్ద మైనస్
వింగ్ కమాండర్ అభినందన్‌ను వెతికిన పాకిస్తాన్