వివాదాలతో నిత్యం వార్తల్లో నిలిచే దర్శకుడు రాంగోపాల్ వర్మ పోలీస్ స్టేషన్‌లో దర్శనమిచ్చాడు. శంషాబాద్ పోలీస్ స్టేషన్‌లో వర్మ కనపటడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే వర్మ పీఎస్‌కు రావటం వెనుక ఓ సినిమా కథ ఉంది.
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ హత్యకేసు పై వర్మ సినిమా చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఘటనకు సంబంధించి స్క్రిప్ట్ పనుల్లో ఉన్న వర్మ నిందితుల్లో ఒకరైన చెన్నకేశవులు భార్యను హైదరాబాద్ పిలిపించుకుని మాట్లాడారు. ఇప్పుడు మరికొన్ని విషయాలను తెలుసుకోటానికి శంషాబాద్ ఎయిర్‌పోర్టు పరిధి పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. శంషాబాద్ ఏసీపీని కలిసి దిశ కేసుకు సంబంధించి, పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ‘దిశ ఘటన గురించి సమాచారం తెలుసుకోవడానికి శంషాబాద్ ఏసీపీని కలిశాను. దిశ సినిమాను తీయడానికి నేను చేస్తోన్న పరిశోధన ఉపయోగపడుతుంది’ అని ఓ జాతీయ మీడియాకు తెలిపారు.
ఎప్పుడూ ఏదో ఒక సంచలనం రేపుతూ వార్తల్లో నిలిచే వర్మ… దిశ సినిమాతో ఇంకా ఎన్నో సంచలన నిజాలు బయటకు తెస్తానని గతంలో చెప్పారు. మరి ఈ సినిమాతో వార్త ఎలాంటి కాంట్రవర్సీ చేస్తారని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.