గత కొద్ది రోజుల నుంచి ఆర్‌ఆర్‌ఆర్ దర్శకుడు రాజమౌళి పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతోంది. హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ కూడా జక్కన్నతో కలిసి ఆర్‌ఆర్‌ఆర్ సినిమాను రెండు సార్లు చూశానని చెప్పడంతో రాజమౌళి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బుయ్యారు. ఈ క్రమంలోనే ప్రపంచ దేశాలలో రాజమౌళి పేరు మ్రోగిపోతుంది.
కాగా ఇలాంటి టైంలో వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకధీరుడు రాజమౌళి పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ప్రపంచ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న రాజమౌళి పై జనాలు పొగడ్తల వర్షం కురిపిస్తుంటే భారతీయ దర్శకులు మాత్రం ఈర్ష్య తో రగిలిపోతున్నారని.. ఈ కోపంతో రాజమౌళిని చంపడానికి కూడా ట్రై చేస్తారు జాగ్రత్త అంటూ హెచ్చరించారు .
‘మొఘల్ ఈ ఆజాం తీసిన కా ఆసిఫ్ నుంచి.. షోలే తీసిన రమేష్ సిప్పీ వరకు అందరినీ నువ్ అధిగమించావ్.. ఆదిత్య చోప్రాలు, కరణ్ జోహర్‌లు, భన్సాలి వంటి వారిని దాటేశావ్.. నువ్వు వెంటనే సెక్యూరిటీ పెంచుకోవాలి. నేను ఇప్పటికే 4 డ్రింక్స్ తాగి ఉన్నా. అందుకే రహస్యాన్ని బయటపెడుతున్నా’ అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది.