రామ్మోహన్ నాయుడు, టీడీపీ ఎంపీ
ఏపీని జగన్ రెడ్డి సొంత కంపెనీలా భావిస్తున్నారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోంది. ఆ దిశగా జగన్ పాలన సాగుతోంది. నాయకత్వం లేదు.. విజన్ లేదు.. ఒక కంపెనీ ముందుకు వచ్చే పరిస్థితి లేదు.. ఎవరైనా వస్తే వాళ్లను దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ నేతలు.
రాష్ట్రంలో ఆర్టికల్ 360 ఉపయోగించాల్సిన పరిస్థితులు దాపురించాయి. కేంద్రం ఏపీపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఏపీ ఆర్థిక పరిస్థితిని సరిదిద్దాలి.
జగన్ ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుండి ఏపీలో విధ్వంసకర పాలన సాగుతోంది. వైసీపీ రాష్ట్రానికి భవిష్యత్ లేకుండా చేస్తోంది. పన్నులు వేసి ప్రజలను పిండి పిండి చేస్తున్నారు.
రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని టీడీపీ పదేపదే చెబుతూ వస్తోంది. తాజాగా కాగ్ నివేదికతో అది మరోసారి రుజువైంది. రూ.48 వేల కోట్లను ఎందుకు ఖర్చు పెట్టారు.. ఎలా పెట్టారో.. అవి ఏమయ్యాయో తెలియదు.