దేశ ప్రజలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం రిపబ్లిక్ డే సందర్భంగా జాతిని ఉద్దేశించి మంగళవారం రాత్రి సందేశం ఇచ్చారు. ఈ రోజు ఎంతోమంది స్వాతంత్ర్య సమరయోధుల పోరాట స్పూర్తిని మనం గుర్తు చేసుకోవాలని అన్నారు. భారత ప్రజాస్వామ్యాన్ని ప్రపంచ దేశాలు కీర్తిస్తున్నాయని రాష్ట్రపతి ఆనందం వ్యక్తం చేశారు. రిపబ్లిక్ డే వేడుకలు మన ఐక్యతకు నిదర్శనమని తెలిపారు.
ఆర్థిక విధానాల్లో కొత్త పుంతలు తొక్కిన టాప్-50 దేశాల జాబితాలో మనకు చోటు దక్కడం గర్వకారణమని అన్నారు. భారత ప్రజాస్వామ్యాన్ని ప్రపంచ దేశాలు కీర్తిస్తున్నాయని రాష్ట్రపతి కొనియాడారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనకు ఇచ్చిన జైహింద్ నినాదాన్ని స్వీకరించాలని సూచించారు. దేశ స్వాతంత్య్రం కోసం ఆయన తపనని, దేశాన్ని గర్వకారణంగా తీర్చి దిద్దాలన్న ఆయన ఆశయాన్ని మనం స్పూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
భవిష్యత్తులో ఎలాంటి సవాళ్లను ఎదురైనా ఢీ కొట్టడానికి దేశం సిద్ధంగా ఉందని చెప్పారు. దేశం మున్ముందు మరింత ప్రగతి బాటలో కొనసాగుతుందని ప్రపంచ సమాజంలో తగిన సామర్ధంతో నిలుస్తుందని ఆకాంక్షించారు. దేశంలో మహిళలు అన్ని రంగాల్లో వారి ప్రతిభను చూపిస్తున్నారని అన్నారు. సైనిక దళాల్లో కూడా మహిళలు చేరుతున్నారని కొనియాడారు. ఆర్మీ దళాల్లో మహిళా అధికారుల ప్రవేశానికి వీలుగా శాశ్వత కమిషన్ ఏర్పాటైందని వివరించారు.
కోవిడ్ ప్రోటోకాల్‌ను ప్రతీ ఒక్కరూ పాటించాలి అన్నారు. మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరాన్ని పాటించాలని తెలిపారు. డాక్టర్లు, హెల్త్ వర్కర్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి కోవిడ్ రోగులను రక్షించిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ మహమ్మారి వలన దేశంలో హెల్త్ కేర్ సిస్టమ్‌ను బలోపేతం అయిందని చెప్పారు. వ్యాక్సిన్ డ్రైవ్‌ను విజయవంతం కావడానికి ప్రధాన కారణమైన హెల్త్ వార్కర్స్ ని అభినందించారు.