బాహుబలిలో హీరో, హీరోయిన్ల కంటే కూడా ఆ సినిమాలో నటించిన రమ్యకృష్ణకు ఎక్కువ మార్కులు పడ్డాయి. ఈ సినిమాలో శివగామిగా రమ్యకృష్ణ పవర్ ఫుల్ రోల్ చేసింది. ముఖ్యంగా చెప్పాలంటే శివగామి పాత్రలో ఆమె పూర్తిగా లీనమైందనే చెప్పాలి. బాహుబలిలో ఆమె పాత్రకు పెద్ద ఎత్తున ప్రశంసలు అందుకోవడంతోపాటు శివగామి పాత్ర ఆమెకు జీవితాంతం గుర్తిండిపోయేలా చేసిందనే చెప్పాలి. అలాంటిది బాహుబలి సినిమా చేసి పెద్ద తప్పు చేశానని రమ్యకృష్ణ మదనపడుతోందట.
కొంతమంది నటీనటులు చేసిన సినిమాలు జీవితాంతం గుర్తిండిపోతాయి. హీరోయిన్ గా ఫేడౌట్ అయిపోయాకా మళ్లీ మంచి పాత్ర లభిస్తే సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. ఆ సమయంలో చేసిన సినిమా ఊహించనివిధంగా స్టార్ ఇమేజ్ తీసుకొస్తే.. దానిని అలాగే కొనసాగించడం కష్టతరమైన పని. ఎందుకంటే ప్రతిసారి ఆలాంటి పాత్రలు దొరకడం చాలా కష్టం. కనుక బాహుబలి సినిమా రమ్యకృష్ణకు మరోసారి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చింది. కానీ ఆ తరువాత రమ్యకృష్ణ చేసిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోతుండటంతో ఆమె ఆలోచనలో పడిందట.
బాహుబలి లాంటి సినిమాలో చేసి స్టార్ ఇమేజ్ సొంతం చేసుకొన్న.. ఆ ఇమేజ్ ను కంటిన్యూ చేసేందుకు తగిన పాత్రలు దొరకడం లేదని అనుకుంటుందట. తాజాగా ఆమె తన భర్త కృష్ణవంశీ దర్శకత్వంలో ‘రంగ మార్తాండ’ సినిమాలో నటిస్తోంది. మరి ఈ సినిమాలో రమ్యకృష్ణ ఎలాంటి పాత్రలో మెప్పిస్తుందో చూడాలి.