రాజమౌళి దర్శకత్వంలోవచ్చిన బాహుబలి సినిమాతో శివగామి గా ప్రేక్షకుల మన్ననలు పొందిన సీనియర్ నటి రమ్యకృష్ణ. శివగామిగా రమ్యకృష్ణ నటనకు సినీ విశ్లేషకులతో పాటు విమర్శకులను సైతం మెప్పించి ఔరా అనిపించింది. బాహుబలి తరువాత కూడా రమ్యకృష్ణ అలాంటి పాత్రలవైపే మొగ్గుచూపుతోంది. తాజాగా సాయిధరమ్ తేజ్ హీరోగా, దేవాకట్టా దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్లాప్ కొట్టారు. అయితే ఈ సినిమాలో రమ్యకృష్ణ పవర్ ఫుల్ రోల్ లో కనిపించనుందట. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పొలిటీషియన్ గా కనిపించనుందని సమాచారం.
బాహుబలి సినిమా తరువాత రమ్యకృష్ణ చాలా సినిమాలు చేసినప్పటికీ అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కానీ ఈ సినిమాతో ఖచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని సినిమా విశ్లేషకులు చెప్తున్నారు. మరి రమ్యకృష్ణ ఈ సినిమాతో ప్రేక్షలను ఏమేర మెప్పిస్తుందో చూడాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.