రమ్యకృష్ణ.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చెయ్యనవసరం లేదు. పవర్ ఫుల్ గా ఉండే లేడీ పాత్ర చెయ్యాలంటే దర్శక నిర్మాతలకు టక్కున గుర్తొచ్చేది రమ్యకృష్ణ. బాహుబలి సినిమాలో శివగామిగా నట విశ్వరూపురం చూపించింది రమ్యకృష్ణ. ఆ సినిమాతో రమ్యకృష్ణ కు ప్రత్యేక గుర్తింపు కూడా వచ్చింది. అయితే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యాష్ హీరోగా ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి గణ విజయం సాధించిన సినిమా కేజీఎఫ్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకోవడం తో పాటు మంచి కలెక్షన్ లు కూడా సాధించింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ గా ప్రస్తుతం ప్రశాంత్ నీల్ పార్ట్ టు సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
ఈ సినిమాలో లేడీ ప్రైమ్ మినిస్టర్ పాత్ర కోసం రమ్యకృష్ణ ను సంప్రదించారట చిత్ర నిర్మాతలు. కేజీఎఫ్ సినిమా లెవెల్ ని, తన క్రేజ్ చూసుకుని పెద్ద మొత్తంలో రెమ్యునిరేషన్ డిమాండ్ చేసిందట. అంత పెద్ద మొత్తంతో రమ్యకృష్ణ డిమాండ్ చెయ్యటంతో రవీనా టాండన్ ను తీసుకున్నారట. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నారు. మొదటి భాగం మంచి విజయం సాధించటంతో పార్ట్ 2 పై భారీ అంచనాలు ఉన్నాయి.
Advertisements