
జయమ్మ జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించడానికి కొంతమంది సన్నాహాలు చేస్తున్నారు. ఈసారి ఒక ప్రయోగం కూడా జరుగుతోంది. వెండితెరతో పాటు డిజిటల్ మీడియాలో వెబ్ సిరీస్‌గా జయలలిత జీవితాన్ని ఆవిష్కరిస్తున్నారు.
జయలలిత పాత్రలో చేస్తున్నది మరెవ్వరో కాదు, మన రమ్యకృష్ణ. తమిళనాడుకు చెందిన చో రామస్వామి ఫ్యామిలీ నుంచి వచ్చిన రమ్యకృష్ణకు తమిళనాట బాగా ఫాలోయింగ్ వుంది. రజినీ కాంత్‌కు దీటుగా రమ్య చేసిన నరసింహా ఇప్పటికీ తమిళ ప్రజలకు క్రేజీ మూవీ. రమ్యకృష్ణ అయితేనే జయలలిత పాత్రకు న్యాయం చేయగలదని భావించి ఆమెను ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి తీసుకున్నారు. ముందుగా తీయబోయే వెబ్‌సిరీస్‌కు ‘క్వీన్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. రెండు సీజన్స్‌గా జయలలిత జీవితాన్నిడిజిటలైజ్ చేయబోతున్నారు. తొలి సీజన్ 10 భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికి వచ్చే స్పందన చూసి రెండోది రూపొందిస్తారు. తమిళంలో రూపొందే ఈ వెబ్ సీరిస్‌ను తెలుగు, హిందీలో చూడొచ్చు. గౌతమ్ మీనన్, మురుగేశన్ ఈ వెబ్‌సిరీస్‌ను డైరెక్ట్ చేస్తున్నారు.
