సీనియర్ నటుడు నరేష్, ప్రవిత్రా లోకేష్ జంటగా కలిసి నటించిన సినిమా ‘మళ్లీ పెళ్లి’. ఈ చిత్రం మే 26వ తేదీన అంటే శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమా హిట్ గ్యారెంటీ అని మూవీ టీమ్ ఆశిస్తోంది. అయితే అనుకోకుండా మళ్లీ పెళ్లి చిత్ర యూనిట్ కి బిగ్ షాక్ తగిలింది.
ఈ సినిమా విడుదలను ఆపాలంటూ నరేష్ భార్య రమ్య రఘుపతి కోర్టును ఆశ్రయించారు. ఈమేరకు ఆమె కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టులో ఫిర్యాదు చేశారు. తన ప్రతిష్టను కించపరిచేలా ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు ఉన్నాయంటూ ఆరోపించారు. ఈ క్రమంలో కోర్టు ఎలాంటి తీర్పును ఇస్తుంది అన్నది ఉత్కంఠగా మారింది.
ఈ చిత్రానికి ఎంఎస్ రాజు దర్శకత్వం వహించగా.. నటుడు వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్, ట్రైలర్ ఆకట్టుకోగా.. కొద్ది రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.
కాగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడైన రఘువీరారెడ్డి సోదరుడి కుమార్తె రమ్య రఘుపతి. ఆమెను 2010లో మూడో వివాహం చేసుకున్నారు నరేష్. వీరికి ఓ బాబు కూడా ఉన్నాడు. గతకొంతకాలంగా వీరిద్దరూ దూరంగా ఉంటున్నారు.