నటుడు నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి మరోసారి మీడియా ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తనకు నరేష్ కు విడాకులు అయిపోయాయని అందుకే ఆయన పవిత్రను పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటిస్తూ ఒక వీడియో విడుదల చేశారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చేందుకు ఒక యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడిన రమ్య రఘుపతి, కృష్ణ చనిపోయిన రోజు ఏం జరిగిందనే విషయం మీద కీలక విషయాలు బయట పెట్టింది.
సూపర్ స్టార్ కృష్ణ మరణించిన రోజు కాకుండా తర్వాత రోజు అంత్యక్రియలు జరిపిన సంగతి తెలిసిందే. ఆయన మనవలు, మనవరాళ్ళు కొంతమంది విదేశాల్లో ఉండటంతో వారు వచ్చేవరకు చివరి చూపు కోసం ఆయన పార్థివ దేహాన్ని నానక్ రామ్ గూడలోని విజయకృష్ణ నివాసంలోనే ఉంచారు.
అయితే సాయంత్రం తొమ్మిది గంటల వరకు మీడియా హడావుడి ఉందని మీడియా ఉన్నంతవరకు సెలబ్రిటీలు ఉన్నంతవరకు హడావుడి చేసిన నరేష్, పవిత్ర 9 గంటల తరువాత మిస్ అయ్యారని రమ్య రఘుపతి పేర్కొన్నారు.
11 గంటల వరకు బయట వ్యక్తులు వచ్చి ఆయనను చివరి చూపు చూసి వెళ్లారు, ఆ తర్వాత 11 గంటల నుంచి ఎవరూ లేరని తాను తన కుమారుడు మాత్రమే ఉన్నామని ఆమె కొన్ని వీడియోలు కూడా బయట పెట్టారు. ఆ వీడియోలలో ఇల్లంతా ఖాళీగా కనిపిస్తోంది. రమ్య, ఆమె కుమారుడు మాత్రమే కృష్ణ పార్థీవ దేహం దగ్గర కనిపిస్తున్నారు.
ఉదయం 3 గంటల సమయంలో కృష్ణ డ్రైవర్లు, కొంత మంది పోలీసులు అక్కడికి వచ్చారు. కానీ అప్పటికి కూడా పవిత్ర కానీ నరేష్ గాని రాలేదని ఆమె ఆరోపించారు. సూపర్ స్టార్ కృష్ణను విజయనిర్మల చాలా అపురూపంగా చూసుకునే వారని ఆయన అంటే ఎంతో ప్రాణం ఇచ్చే వారిని రమ్య అన్నారు.
అయితే తన తల్లి అంతలా ప్రేమించిన వ్యక్తి చనిపోతే ఆయన పార్థివ దేహం దగ్గర కూడా సమయం గడిపే అంతా మనసు నరేష్ కు లేదని ఈ సందర్భంగా రమ్య రఘుపతి పేర్కొన్నారు. ఆ రోజు రాత్రి విజయనిర్మల ఆత్మ ఎంత క్షోభించి ఉంటుందో అని రమ్య రఘుపతి ఆవేదన వ్యక్తం చేశారు.