సీనియర్ నటుడి నరేశ్ నాలుగో ఇంటివాడయ్యేందుకు అడ్డంకులు అధికమయ్యాయి.మూడో భార్య రమ్య రఘుపతితో వివిదాల అనంతరం.. నరేశ్ – పవిత్ర లోకేశ్ జంటకాబోతున్నట్లు ఒక వీడియో ద్వారా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా రమ్య రఘుపతి స్పందించారు.నరేశ్ నాకు ఇంకా విడాకులు ఇవ్వలేదు. సదరు కేసింకా కోర్టులోనే ఉందని గుర్తుచేసారు. వీడియోలు రిలీజ్ చెయ్యొచ్చుగాక పెళ్ళి మాత్రం చేసుకోనివ్వనని ఆమె స్పష్టం చేసారు.
నరేశ్ తనను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడని, మా వాళ్ళు అతనితో పెళ్ళి వద్దంటే విజయ నిర్మల మావాళ్ళకి నచ్చజెప్పి పెళ్ళి చేసారని ఆమె తెలిపారు. పెళ్ళయ్యాకా నరేశ్ కి పలువురితో సంబంధాలున్నాయని తెలిసి బాధపడ్డాను, ఆ విషయంలో తను నాకు చాలా సార్లు క్షమార్పణలు కూడా చెప్పాడు.
“సమ్మోహనం” సినిమా చేస్తున్నప్పుడు నటి పవిత్ర లోకేశ్ కి నరేశ్ పరిచయం ఏర్పడింది. ఒకరోజు ఆమెను తమ ఇంటికి కూడా తీసుకువచ్చాడు ఆమెది బెంగుళూరని పరిచయం చేసాడు. అప్పట్లో పెద్దగా పట్టించుకోలేదు. కానీ “మా” ఎన్నికలప్పుడు వారిద్దరిమీద తనకు అనుమానం వచ్చిందన్నారు.
రీసెంటుగా వాళ్ళిద్దరూ కలిసి ఓ వీడియో విడుదల చేసారు. అది సినిమా ప్రమోషన్ కోసం కావొచ్చు,వీళ్ళు నన్ను ఇబ్బంది పెట్టడానికి ఇలాంటివెన్నో చేసారు. వీళ్ళు చేసిన పనుల వల్ల నా పదేళ్ళకొడుకు “నాన్నకు విడాకులు ఇవ్వొద్దు” అని ఓ సారి నానుంచి మాట తీసుకున్నాడు.
ఎంత కష్టమైనా నేను పోరాటం చేస్తా. విడాకులివ్వను.నరేశ్ తో కలిసి ఉండడానికే ప్రయత్నిస్తాను.కోర్టులో కేసునడుస్తోంది. నేనైతే విడాకులివ్వడానికి సిద్ధంగా లేనని చెప్పుకొచ్చారు రమ్యారఘపతి.
New Year ✨
New Beginnings 💖
Need all your blessings 🙏From us to all of you #HappyNewYear ❤️
– Mee #PavitraNaresh pic.twitter.com/JiEbWY4qTQ
— H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) December 31, 2022