మహేష్ సినిమాకు మరో ఎట్రాక్షన్ వచ్చి చేరింది. ఈ సినిమాలోకి రమ్యకృష్ణ జాయిన్ అయింది. సెలక్టివ్ గా సినిమాలు చేసే రమ్యకృష్ణ, మహేష్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటే, ఆ పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
నిజానికి ఈ కథను, చాలా రోజుల కిందటే రమ్యకృష్ణకు చెప్పాడట త్రివిక్రమ్. అప్పట్నుంచి నలుగుతూనే ఉంది. ఇన్నాళ్లకు రమ్యకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే ఆమె సెట్స్ లో మహేష్ బాబును కలవనుంది.
ఈ సినిమా కోసం హైదరాబాద్ శంకరపల్లి శివార్లలో భారీ బంగ్లా సెట్ వేశారు. సోమవారం నుంచి ఈ సెట్ లోనే షూటింగ్ చేయబోతున్నారు. పూజాహెగ్డే, శ్రీలీల ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఆగస్ట్ లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. అయితే మే నెలలో మహేష్ బాబు విదేశాలకు వెళ్లబోతున్నాడు. ఈ లోగా సినిమా షూటింగ్ కంప్లీట్ అవుతుందా, అవ్వదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.